: కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాంతో స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాణిపాకంలో ఇవాళ స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.