: ఫిఫాకు ఇదేమి కష్టం చెప్మా..?


సాకర్ గురించి తెలిసిన వారికి హెడర్ షాట్ గురించి చెప్పనక్కర్లేదు. తలతో బంతిని కొట్టడాన్ని హెడర్ అని అంటారు. అయితే, ఈ షాట్ కారణంగా దీర్ఘకాలంలో తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని అమెరికాలోని కొందరు తల్లులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా)పై కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. హెడర్ తో చిన్నారుల తలలోని సున్నితమైన భాగాలకు గాయాలవుతున్నాయని వారు వివరించారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళలు కాలిఫోర్నియా న్యాయస్థానంలో దావా వేశారు. అండర్-17 క్రీడాకారులు శిక్షణలో భాగంగా ఈ షాట్ ను ఆడకుండా నిషేధం విధించాలని, లేక, వారానికి ఇన్ని హెడర్లంటూ పరిమితం చేయాలని వారు కోర్టుకు విన్నవించుకున్నారు. ఇక, అండర్-14 ఆటగాళ్ళు అసలు ఈ షాట్ ఆడకుండా పూర్తి నిషేధం విధించాలని ఈ తల్లులు కోరారు. మరి, ఫిఫా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News