: వరద నీటితో నిండిన జూరాల జలాశయం
భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో జూరాల జలాశయం పూర్తిగా నిండింది. వర్షాలు కురవడంతో పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతోంది. 11 ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. జూరాల డ్యాంకు ఇన్ ఫ్లో లక్షా 23 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో లక్షా 46 వేల క్యూసెక్కులు ఉంది. మొత్తం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.