: కోహ్లీ బుర్ర ఉపయోగించాలి: బాయ్ కాట్ సలహా
టీమిండియా అద్భుత విజయం సాధించిన రెండో వన్డేలోనూ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలం కావడం పట్ల ఇంగ్లండ్ మాజీ సారథి జెఫ్రీ బాయ్ కాట్ స్పందించారు. కోహ్లీ బ్యాటింగ్ సమయంలో బుర్ర ఉపయోగించాలని సలహా ఇచ్చారు. షాట్ సెలెక్షన్ మరీ చెత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మదిలో గందరగోళం నెలకొని ఉన్నట్టుందని, అందుకే, రెండో వన్డేలో రాంగ్ షాట్ ఆడి అవుటయ్యాడని బాయ్ కాట్ విశ్లేషించారు. ప్రతిభ ఉన్నా, తెలివిలేకుండా అది రాణించదని సూచించారు. కోహ్లీ కూడా ఇలానే తన నైపుణ్యాన్ని వృథా చేసుకుంటున్నాడని తెలిపారు.