: విశాఖ భరత్ నగర్ లో విషాదం


విశాఖ అరిలోవ రెండో సెక్టారులోని భరత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. వేంకటేశ్వరస్వామి ఆలయం గోడ కూలి శ్రీనివాస్ (40) అనే భక్తుడు మృతి చెందాడు. ఇవాళ ఉదయం ఆలయంలో శ్రీనివాస్ ప్రదక్షిణలు చేస్తుండగా గోడ కూలి ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనలో మరికొందరు కూడా గాయపడినట్టు సమాచారం. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడ నాని కూలిపోయిందని స్థానికులు తెలిపారు.

  • Loading...

More Telugu News