: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
హైదరాబాదులోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుని పూజలలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ జరుగుతోంది.