: మెదక్ ఉపఎన్నికలో విజయం కోసం వామపక్షాల మద్దతు కోరిన టీఆర్ఎస్
మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం కోసం టీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. ఈ గెలుపు బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకు అప్పజెప్పారు. ఇప్పటికే ఉపఎన్నికలో విజయం కోసం పలు వ్యూహాలు రచించిన హరీష్... తాజాగా వామపక్షాల మద్దతు కోరారు. తెలంగాణ రాష్ట్ర సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలను కలిసి మెదక్ ఉపఎన్నికలో తమకు మద్దతు తెలిపాలని ఆయన కోరారు.