: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పరిటాల సునీత
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.