: తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు!


ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారయ్యింది. సెప్టెంబర్ 5వ తారీఖున కేసీఆర్ సమక్షాన... అత్యంత ఘనంగా తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమం ద్వారా ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. సుమారు 2వేల వాహనాల భారీ కాన్వాయ్ తో... వేలాది మంది అనుచరులతో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు అంటున్నాయి. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబులతో పాటు దాదాపు 15మంది జడ్పీటీసీలు... వందలమంది ఎంపీటీసీలు, సర్పంచులు ఆయనతో పాటు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మరో సీనియర్ టీడీపీ నేత నామా నాగేశ్వరరావుతో ఉన్న విభేదాల కారణంగానే ఆయన టీడీపీని వీడుతున్నారు. తుమ్మల టీఆర్ఎస్ చేరుతుండడంతో ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ... ఇకపై పుంజుకోనుంది.

  • Loading...

More Telugu News