: అత్తవారింట టాయిలెట్ లేదని భర్తకు విడాకులిచ్చిన అభిమానవతి!


ఛత్తీస్ గఢ్ లో ఓ మహిళ మెట్టినింట టాయిలెట్ నిర్మించడానికి భర్త పూనుకోకపోవడంతో, అతనికి విడాకులిచ్చి తన ఆత్మాభిమానాన్ని చాటుకుంది. రాయ్ గఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. వివాహానికి ముందే టాయిలెట్ నిర్మించాలని అమ్మాయి తరపు వారు షరతు విధించినా, భర్త తరపు వారు ఆ షరతు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో, భార్యాభర్తల మధ్య పలుసార్లు గొడవలు కూడా వచ్చాయి. అత్తింటి వారి తీరుకు నిరసనగా ఆమె పుట్టింటికి చేరడం, మళ్ళీ రావడం... ఇలా పదేపదే జరిగింది. గ్రామంలో అందరి ముందు నడుచుకుంటూ బహిర్భూమికి వెళ్ళాల్సి రావడం సిగ్గుచేటని భావించి, ఇక, ఇది పనికాదనుకుని ఆ అభిమానవతి విడాకులు తీసుకుని పుట్టింటికి చేరింది. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. కుషినగర్ జిల్లాలోని తమ అత్తవారిళ్ళలో టాయిలెట్లు లేకపోవడంతో ఆరుగురు నవ వధువులు పుట్టింటికి చేరడంతో చర్చనీయాంశం అయింది.

  • Loading...

More Telugu News