: ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ ప్రత్యేక పూజలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 121 ఏళ్ల క్రితం స్వతంత్ర సేనాని తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు. హైదరాబాదులోనూ అత్యంత వైభవంగా గణేశ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ లో ప్రతిష్ఠించిన మహా గణపతి మండపానికి గవర్నర్ నరసింహన్ సతీ సమేతంగా విచ్చేసి గణాధిపతిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు విశ్వరూప గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.