: నేడు జాతీయ క్రీడా దినోత్సవం


జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ దేశంలో అయినా క్రీడాకారులు ఘనంగా జరుపుకుంటారు. కానీ, భారత్ లో మాత్రం పరిస్థితి భిన్నం. హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి యేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ, ఇది మొక్కుబడిగానే సాగుతోంది. ఆ రోజు ధ్యాన్ చంద్ విగ్రహానికి దండలు వేసి అధికారులు, క్రీడాకారులు చేతులు దులుపుకుంటున్నారు. కనీసం ఈ ఒక్క రోజైనా పట్టించుకుంటే క్రీడలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. భారత్ లో క్రీడా దినోత్సవం అంటే కేవలం హాకీ క్రీడాకారులకు చెందిన ఉత్సవంగా భావిస్తున్నారు. రాష్ట్రపతి ప్రతి యేటా క్రీడాకారులకు అవార్డులను అందజేస్తున్నారు. ధ్యాన్ చంద్ (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్), అర్జున, ద్రోణాచార్య అవార్డులను అందించే వేడుక ఈసారి కూడా జరుగుతుంది. కానీ, ఈసారి ఖేల్ రత్న అవార్డుకు ఎవరినీ ఎంపిక చేయలేదు.

  • Loading...

More Telugu News