: హైదరాబాదులో ఒకే రోజు... 2 లక్షల ఖాతాలు
హైదరాబాదులో ఒక్క రోజులోనే సుమారు రెండు లక్షల సేవింగ్ అకౌంట్స్ తెరచి జంటనగర వాసులు రికార్డు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ‘ప్రధాని జన్ ధన్ యోజన’ పథకాన్ని ప్రారంభించగా... తెలంగాణ లీడ్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గురువారం నాడు 96,146 ఖాతాలు తెరిచింది. మిగిలిన బ్యాంకుల శాఖల్లో లక్ష మందికి పైగా ఖాతాలు తెరచి ఉంటారని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి. బీమా సదుపాయం ఉండటం అన్ని వర్గాలకూ ఆకర్షణీయంగా మారింది.