: ఏపీ రాజధానిపై వస్తున్న వార్తలు నిజం కాదు: కేంద్ర హోం శాఖ
మార్టూరు-వినుకొండ-దొనకొండ జోన్ ను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శివరామకృష్ణన్ కమిటీ సూచించిందంటూ హల్ చల్ చేస్తున్న వార్తలు వాస్తవాలు కాదని కేంద్ర హోం శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని అంశాలని కేంద్ర హోం శాఖ తెలిపింది. నేటి సాయంత్రం కమిటీ నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ నివేదికను శుక్రవారం హోం మంత్రి పరిశీలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హోం మంత్రి పరిశీలించిన తరువాతే నివేదిక వెబ్ సైట్లో పెడతారని, అప్పుడే నివేదిక బహిర్గతమవుతుదని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి.