: తిరుమలేశుడిని దర్శించుకున్న కేంద్రమంత్రి గంగారాం గీతే


కేంద్ర మంత్రి గంగారాం గీతే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ రాత్రి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో ఇవాళ జన్ ధన్ యోజనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికీ బ్యాంకు అకౌంట్ కల్పించడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల్లో అవినీతి తగ్గుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికీ బీమా సౌకర్యం కూడా లభిస్తుందన్నారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రతిగా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని గంగారాం గీతే చెప్పారు.

  • Loading...

More Telugu News