: మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు


మరో 24 గంటల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావారణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలతో రైతాంగంలో ఆశలు చిగురించాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో... పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదులో ఇవాళ ఓ మోస్తరు వర్షం కురవగా, ఖమ్మం జిల్లా వెంకటాపురంలో భారీ వర్షం పడింది.

  • Loading...

More Telugu News