: మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


పెళ్లి చేసుకోబోయే జంటకు వివాహానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా లైంగిక సామర్థ్యం లేనివారు, సమస్యలు ఉన్నవారు వాటిని దాచిపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటే ఎందుకు ప్రశ్నించకూడదని నిలదీసిన న్యాయస్థానం, వివాహానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే లైంగిక సామర్థ్యం, వ్యాధుల వంటి వాటిపై అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించింది. సమస్యలను దాయడం ద్వారా మహిళలు నష్టపోయి, బాధితులుగా మిగులుతున్నారని న్యాయస్థానం తెలిపింది. దీనికి సరైన పరిష్కారం వివాహానికి ముందే వైద్య పరీక్షల నిర్వహణ అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News