: రద్దీ కారణంగా సికింద్రాబాదు - విశాఖ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు


ప్రయాణికుల రద్దీ కారణంగా సికింద్రాబాదు - విశాఖ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సెప్టెంబరు 5, 12న రాత్రి 10.10కి సికింద్రాబాదు - విశాఖ ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు బయల్దేరుతుంది. సెప్టెంబరు 6, 13వ తేదీల్లో రాత్రి 7.05కు విశాఖ - సికింద్రాబాదు ఏసీ సూపర్ ఫాస్ట్ రైలు బయల్దేరుతుంది. సికింద్రాబాదు - హుబ్లీ మధ్య 26 ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 3వ తేదీ నుంచి బుధ, శుక్ర, ఆదివారాల్లో సికింద్రాబాదు నుంచి హుబ్లీకి ఈ రైలు బయల్దేరుతుంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి మంగళ, గురు, శనివారాల్లో హుబ్లీ-సికింద్రాబాదు రైలు నడుస్తుంది.

  • Loading...

More Telugu News