: విశాఖకు త్వరలో కొత్త విమాన సర్వీసులు: అశోక్ గజపతిరాజు
విశాఖకు త్వరలో కొత్త విమాన సర్వీసులు రానున్నాయని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విశాఖ నుంచి మరిన్ని సర్వీసులు నడిచేలా వివిధ విమానయాన సంస్థలతో సంప్రదింపులు చేశామని అన్నారు. రక్షణ శాఖ పరిధిలో ఉన్నందున విశాఖ విమానాశ్రయ విస్తరణకు అడ్డంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సూచించామని ఆయన వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఎక్కడ నిర్మించాలనే దానిని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.