: పెడన ఎంపీపీ భూలక్ష్మిపై అనర్హత వేటు
కృష్ణాజిల్లాలోని పెడన ఎంపీపీపై అనర్హత వేటు పడింది. జన్ను భూలక్ష్మి ఎంపీటీసీ సభ్యత్వం రద్దు అయింది. మండలంలోని నందిగామ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్సీపీ టిక్కెట్ పై గెలుపొందిన భూలక్ష్మి ఆ తర్వాత టీడీపీ మద్దతుతో గత జూన్ నాలుగో తేదీన ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. తమ పార్టీ విప్ ను ఎంపీపీ ధిక్కరించారని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అధికారులు ఆమెపై అనర్హత వేటు వేశారు.