: చెలరేగిన ఆ ఇన్నింగ్సుకు స్ఫూర్తి రవిశాస్త్రి: రైనా
దీటైన ఆటను ప్రదర్శించు... అంటూ టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసమే తన మెరుగైన ప్రదర్శనకు కారణమని సెంచరీ హీరో సురేష్ రైనా తెలిపాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో చెలరేగి ఆడిన సురేష్ రైనా తన ఆత్మవిశ్వాసానికి కారణం రవిశాస్త్రి మాటలేనని తెలిపాడు. రవిశాస్త్రి చెప్పిన మాటలు జట్టులో ఆత్మవిశ్వాసం ప్రోది చేశాయని ఆయన పేర్కొన్నారు. బస్సులో వెళ్తుండగా తన పక్కన కూర్చున్న రవిశాస్త్రి మైదానంలో ఎలా ఆడితే ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తామో చెప్పారని రైనా తెలిపారు.