: జగ్గారెడ్డి చేరికతో బీజేపీ కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది: హరీష్ రావు


తెలంగాణ వద్దన్న జగ్గారెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని టీఎస్ మంత్రి హరీష్ రావు బీజేపీని నిలదీశారు. జగ్గారెడ్డిని మెదక్ లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయిందని అన్నారు. జగ్గారెడ్డి చేరికతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ ఆవహించిందని చెప్పారు. జాతీయ నేత అద్వానీని వెళ్లగొట్టిన బీజేపీ... జగ్గారెడ్డిని మాత్రం పార్టీలో చేర్చుకుందని ఎద్దేవా చేశారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని... ఎన్నిక ముందే రెండు పార్టీలూ చేతులెత్తేశాయని అన్నారు.

  • Loading...

More Telugu News