: స్నానం చేస్తున్న మహిళను షూట్ చేస్తూ దొరికాడు


వచ్చిన పని మానేసి తప్పుడు పని చేస్తున్న ఓ వ్యక్తిని మహిళ పోలీసులకు పట్టించింది. హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సయ్యద్ నగర్ లో నివాసముంటున్న రవూఫ్ (31) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తుంటాడు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12లోని ఓ అపార్ట్ మెంట్ లో పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అదే అపార్ట్ మెంట్ లో బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ (24)ను తన సెల్ ఫోన్ తో రహస్యంగా వీడియో తీయసాగాడు. ఇంతలో అటుగా వచ్చిన ఓ మహిళ అతడి నిర్వాకం గ్రహించి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేసింది. దీంతో అతను పరారయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలించిన పోలీసులు రవూఫ్ ను పట్టుకుని కటకటాల వెనక్కినెట్టి నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News