: పేదవాడికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం: చంద్రబాబు


అనేకమంది ప్రజలు ఇప్పటికీ నానా కష్టాలు పడుతున్నారని... వారందరికీ ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజమండ్రిలో జన్ ధన్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదవారి జీవితాల్లో ఈ పథకం మార్పు తీసుకొస్తుందని అన్నారు. దేశమంతా ఈ పథకం ఒకేసారి అమలు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగు అక్షరం, తెలుగు నుడికారాలకు పుట్టినిల్లైన రాజమండ్రిలో ఈ పథకం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News