: కుర్రాడయిన అమితాబ్
తాజాగా 'కౌన్ బనేగా మహా కరోడ్ పతి' షోలో చోటు చేసుకున్న ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి అభిమాని యాంగ్రీ యంగ్ మేన్ అమితాబ్ బచ్చన్ మరోసారి యవ్వనంలోకి అడుగుపెట్టినట్టు ఫీలయ్యారు. సినిమాలను కూడా ప్రమోట్ చేస్తున్న అమితాబ్ తాజా ఎపిసోడ్ లో 'ఫైండింగ్ ఫన్నీ' తారాగణం దీపికా పదుకునే, అర్జున్ కపూర్ తో 'కౌన్ బనేగా మహాకరోడ్ పతి’ ఆడారు. ఈ సందర్భంగా అమితాబ్ 'ఫైండింగ్ ఫన్నీ’ సినిమాలో ఆదరణ పొందిన 'షేక్ యువర్ బుటియా' పాటకు దీపికా పదుకునేతో స్టెప్పులేశారు. యువతార దీపికతో బిగ్ బీ స్టెప్పులేయడం చూసిన ఆయన అభిమానులు సంబరపడిపోయారు. ఈ ఎపిసోడ్ విశేషాలను అమితాబ్ తన బ్లాగ్ లో పోస్టు చేశారు.