: దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఒకే రోజు కోటిన్నర ఖాతాలు తెరవడం ఇదే తొలిసారి: మోడీ


న్యూఢిల్లీలో ‘జన్ ధన్ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఒకే రోజు కోటిన్నర ఖాతాలు తెరవడం ఇదే తొలిసారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా చాలామందికి ఖాతాలు లేవని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలనేది ఈ పథకం లక్ష్యమని చెప్పారు. సమాజంలో ఇప్పటికీ ఆర్థిక అస్పృశ్యత ఉందని, దాన్ని తొలగించి పేదలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత కోసమే ఈ పథకానికి జన్ ధన్ పేరును పెట్టామన్నారు. పేదలు అత్యవసర సమయాల్లో అధిక వడ్డీకి అప్పులు తెస్తున్నారని, వారి కష్టాలకు ఇదే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరవడం వల్ల బ్యాంకు శాఖలు విస్తరిస్తామని, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ పథకం వల్ల ధనవంతులతో పాటు పేద ప్రజలు కూడా డెబిట్ కార్డు వాడుతారని ఆయన చెప్పారు. జనవరి 26వ తేదీ లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారికి లక్ష రూపాయల ప్రమాద బీమా, 30 వేల రూపాయల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రధాని చెప్పారు.

  • Loading...

More Telugu News