: వినాయక చవితి సందర్భంగా హైదరాబాదు మార్కెట్లు కళకళ


వినాయక చవితి పండుగ సందర్భంగా హైదరాబాదు మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వాడవాడలా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. విఘ్నేశ్వరుని పూజకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తరలిరావడంతో మార్కెట్లో సందడి నెలకొంది. పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రచారం చేయడంతో పలువురు మట్టి విగ్రహాలను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నగరంలోని అపార్ట్ మెంట్లలోనూ లంబోదరుడిని ప్రతిష్ఠించి పూజలు జరుపుతారు. ఖైరతాబాద్ లో భారీ విఘ్నాధిపతిని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News