: నాలుగు నెలలుగా ఇదే హింస...ఎవరితో చెప్పుకోవాలి?
వ్యామోహం వెర్రితలలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అనడానికి ఉదాహరణ నాగ్ పూర్ దగ్గర్లో జరిగిన ఘటన. నాగ్ పూర్ కు సమీపంలోని ఉమరర్ లోని ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్న అభిజిత్ రాంబావ్ రగ్డేట్ (36)కు ఓ మహిళతో నాలుగు నెలల క్రితం పెళ్లైంది. పెళ్లినాటి నుంచి అంటే మే 7 నుంచి ఆగస్టు 13 వరకు అసహజ రీతిలో శృంగారానికి ఒత్తిడి చేయడమే కాకుండా, బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. లకాఢ్ గంజ్ లోని తమ ఇంట్లోనే కాకుండా, అతడి సొంతూరు హింగాంగ్ హట్ లో కూడా ఇలాగే వేధించేవాడని ఆమె పోలీసులకు తెలిపారు. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదని ఆమె పెర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడికి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.