: మోడల్ ముద్దుగుమ్మకు ఫేస్ బుక్ ఝలక్


సెక్సీ మోడల్ పూనం పాండేకు ఫేస్ బుక్ షాకిచ్చింది. ఈ వివాదాస్పద మోడల్ ఖాతాను ఫేస్ బుక్ నిలిపివేసింది. దీంతో, సోషల్ మీడియాలో ఈమె హల్ చల్ కు సగం అడ్డుకట్ట పడ్డట్టేనని భావిస్తున్నారు. కాగా, తన అకౌంట్ నిలిపివేతపై పూనం స్పందిస్తూ, ఎంతగానో విచారిస్తున్నట్టు ట్వీట్ చేసింది. నిలిపివేతకు కారణం తెలియదని, అకౌంట్ ను ఎలా పునరుద్ధరించుకోవాలో చెప్పండంటూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ ను కోరింది. సోషల్ మీడియాలో ఈ మోడల్ ముద్దుగుమ్మ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాను వింతవింత భంగిమల్లో ఉన్న ఫొటోలను పోస్టు చేస్తూ నిత్యం కుర్రకారును కిర్రెకిస్తూ ఉండడం ఈమె నైజం. కాగా, పూనం అర్థనగ్నంగా, కాసింత అసభ్యంగానే ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన పోస్టింగ్ పైనే ఫేస్ బుక్ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News