: మెదక్ ఎన్నికల్లో మాకు ఎదురు లేదు: జగదీష్ రెడ్డి
మెదక్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ‘మాకు ఎదురే లేదు... మమ్మల్నెవరూ ఆపలేరు’ అని ఆయన ధీమాగా చెప్పారు. ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించాయని అన్నారు. తాము విద్యా వ్యవస్థలో సంస్కరణలను తీసుకువస్తామని ఆయన చెప్పారు.