: భారత్-పాక్ చర్చల పునరుద్ధరణకు తీర్మానం... జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం


భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు పునరుద్ధరించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ్యుల వాయిస్ ఓటు ద్వారా ఏకగ్రీవంగా సభ తీర్మానానికి అంగీకారం తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దులో శాంతి నెలకొనేందుకు భారత్-పాక్ మధ్య తప్పకుండా చర్చలు జరిగేలా చూడవలసినదిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తీర్మానంలో కోరారు. అంతేగాక, సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు జరగకుండా సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News