: శారదా గ్రూప్ స్కాంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం


శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో దర్యాప్తును సీబీఐ మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలో, అసోం ఎమ్మెల్యేలు హిమంత బిస్వా శర్మ, అంజన్ దత్తాల నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. గత నెలలో ఈ స్కాంకు సంబంధించిన వారి ఇళ్లలో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నాలుగు రోజుల కిందట (ఆదివారం) ఈ కేసులో కోల్ కతాకు చెందిన సంధీర్ అగర్వాల్ అనే వ్యాపారవేత్తను సీబీఐ అరెస్టు చేసింది.

  • Loading...

More Telugu News