: ఇంగ్లండ్ జట్టుకు జరిమానా వడ్డన


టీమిండియాతో రెండో వన్డేలో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టుకు మ్యాచ్ రిఫరీ జరిమానా వడ్డించాడు. కుక్ సేన స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిందంటూ రిఫరీ రంజన్ మదుగళే ఈ నిర్ణయం తీసుకున్నారు. జరిమానాలో భాగంగా ఇంగ్లండ్ ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 10 శాతం, కెప్టెన్ కుక్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. నిర్ణీత సమయానికి ఒక్క ఓవర్ తక్కువ విసరడంతో ఈ జరిమానా వడ్డించారు.

  • Loading...

More Telugu News