: అది నివేదిక కాదు, నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇతరరాష్ట్రాల నాయకులు చేసిన కుట్ర: ఏపీఎన్జీవో సంఘం


శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ఏపీఎన్జీవోలు ఫైర్ అయ్యారు. రోడ్డు, రైలు సౌకర్యాలతో పాటు విమానయాన, షిప్పింగ్ సౌకర్యాలకు సమీపంగా ఉన్న చోటును (విజయవాడను ఉద్దేశించి) వదిలి పెట్టి, ఇవేవీ లేని ప్రాంతాన్ని (వినుకొండ-దొనకొండ-మార్టూరు) శివరామకృష్ణన్ కమిటీ రాజధానిగా సూచించిందని ఏపీఎన్జీవో నేత విద్యాసాగర్ మండిపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఆర్థిక, పర్యావరణ సమస్యలు వస్తాయని కమిటీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించలేదని ఆరోపించారు. విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాల్లో 24వేల ఎకరాలు సాగుబడిలో లేని భూమి ఉందని విద్యాసాగర్ తెలిపారు. కనెక్టివిటీలో విజయవాడను మించిన నగరం ప్రస్తుతం దక్షిణాదిన వేరే ఏదీ లేదన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల నాయకులు శివరామకృష్ణన్ కమిటీ ద్వారా కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను శివరామకృష్ణన్ కమిటీ ఒక్కో జిల్లాలో పెట్టాలని సూచించడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు... ఇలా మూడూ ఒక చోట ఉంటేనే... పనులు కదలడం లేదని... ఇక, ఈ మూడు విభిన్న నగరాల్లో ఉంటే అసలు ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News