: కరుణానిధి కుమారుడు అళగిరిపై భూకబ్జా కేసు
భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు, ఆ పార్టీ మాజీ నేత ఎంకే అళగిరిపై మధురై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చేసిన ఫిర్యాదులో, మధురైలో అళగిరికి చెందిన 'దయ ఇంజనీరింగ్ కాలేజ్' బయట ఆలయానికి సంబంధించిన 44 సెంట్ల భూమి ఉంది. దాన్ని నకిలీ పత్రాలతో కళాశాల వారు ఆక్రమించుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసు అధికారి తెలిపారు. కాగా, అళగిరిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. అటు, ఆయనపై చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని సన్నిహితులు ఆరోపించారు.