: ఇంటర్నెట్, ఈ-కేంద్రాలలో శ్రీవారి దర్శనం టికెట్ల కోటా పెంపు
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను టీటీడీ పదకొండువేలకు పెంచింది. వాటిలో ఆరువేల టికెట్లను ఇంటర్నెట్ లో, ఐదు వేల టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరులోని ఈ-దర్శన్ కేంద్రాలలో అందుబాటులో ఉంచనున్నారు. ఆ టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత రెండో రోజు, ఏడవ రోజు, రెండు వారాల తర్వాత వినియోగించుకునే విధంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఇదే విధానాన్ని కాలినడకన, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు కూడా త్వరలో అమలు చేస్తామని ఈవో గోపాల్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి తొలిసారి టీటీడీ ఐదువేల టికెట్లను ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఆన్ లైన్, ఈ-దర్శన్ కేంద్రాలలో జారీ చేసింది. ఇందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం వల్లనే కోటా పెంచింది.