: రాజధానిపై రోజుకో మాట మాట్లాడవద్దని మంత్రులను ఆదేశించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై తలా ఒక మాట మాట్లాడవద్దని సీఎం చంద్రబాబునాయుడు మంత్రులను ఆదేశించారు. మంత్రులు రోజుకో అభిప్రాయం వ్యక్తం చేస్తే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అందరికీ ఉపయోగకరమైన చోటే నూతన రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. కేంద్రంతో చర్చించి రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.