: క్షమాపణలు చెప్పడంతో వైకాపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత
మొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ పోడియం వద్ద మైక్ విరగ్గొట్టి సస్పెన్షన్ కు గురైన వైకాపా ఎమ్మెల్యేలు మణిగాంధీ, శివప్రసాద్ రెడ్డి తమ చర్యపై స్పీకర్ కు సభాముఖంగా క్షమాపణ చెప్పారు. దీంతో, వీరిపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభలో ప్రకటించారు.