: ఫ్లాగ్ మీటింగ్ జరిగిన కొన్ని గంటలకే మళ్లీ పాక్ బలగాల కాల్పులు
బోర్డర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు నిన్న భారత్, పాక్ ఆర్మీ అధికారుల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మీటింగ్ పూర్తయిన కొన్ని గంటలకే ముష్కర పాక్ సైన్యం తన బుద్ధిని మరోసారి చాటుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి మరోసారి బీఎస్ఎఫ్ పోస్టులపై కాల్పులు జరిపింది. మొత్తం మూడు బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన పాక్ సైనికుల కాల్పులు ఉదయం 6 గంటల వరకు కొనసాగాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.