: టీడీపీని వీడి... టీఆర్ఎస్ లోకి వెళ్లే ఉద్దేశం నాకు లేదు:కూకట్ పల్లి ఎమ్మెల్యే
టీడీపీని వీడే ఉద్దేశం తనకు లేదని హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. ఇటీవల కాలంలో మాధవరం కృష్ణారావుకు టీఆర్ఎస్ నేతలు 'వల' వేస్తున్నారనే ప్రచారం జోరందుకున్న నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు తనను వారి పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని... టీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా తనమీద ఒత్తిడి కూడా తీసుకువచ్చారని మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. అయితే తనకు టీడీపీని వీడే ఆలోచన ఇసుమంత కూడా లేదని స్పష్టం చేశారు. తాను ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నానని... భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆయన తేల్చిచెప్పారు.