: రాజధానిని ఒకే చోట కాకుండా మూడు జోన్లుగా వికేంద్రీకరించడం మేలు: శివరామకృష్ణన్ కమిటీ


రాష్ట్ర రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోంశాఖకు నిన్న నివేదిక సమర్పించింది. రాజధానిని ఒకే చోట నిర్మించకుండా... మూడు జోన్లుగా వికేంద్రీకరిస్తే మేలని నివేదికలో సూచించింది. విజయవాడ-గుంటూరు, విశాఖపట్నం-విజయనగరం, రాయలసీమలను మూడు క్లస్టర్లుగా చేసుకుని వికేంద్రీకరించుకోవాలని తెలిపింది. రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, సీఎం కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని... మిగిలిన కార్యాలయాలను ఆయా ప్రాంత స్వభావాలను బట్టి ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News