: ఛార్జీలు తగ్గించకుంటే జెమినీ ఛానల్స్ ప్రసారాలను నిలిపివేస్తాం: ఏపీ ఎం.ఎస్.వోలు
జెమినీ గ్రూప్ ఛానల్స్ పై ఏపీ ఎం.ఎస్.వోలు ధ్వజమెత్తారు. జెమిని గ్రూప్ యాజమాన్యం తమ పే చానల్స్ పై రుసుమును 27 శాతం పెంచిందని ఏపీ ఎం.ఎస్.వోలు పేర్కొన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచుతూ... జెమినీ గ్రూపు బ్లాక్ మెయిలింగ్ వ్యాపారానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. తమ డిమాండ్ కు దిగిరాకపోతే జెమినీ గ్రూప్ ఛానల్స్ ను ప్రాధాన్యత లేని చోట పెడతామని వారు హెచ్చరించారు. అవసరమనుకుంటే, వచ్చేనెల నుంచి జెమినీ గ్రూప్ చానల్స్ ప్రసారాలను నిలిపివేసేందుకు కూడా తాము వెనుకాడమని ఏపీ ఎం.ఎస్.వోలు హెచ్చరించారు.