: ఇంగ్లండ్ లక్ష్యం 305 కాదు... 295
ఇంగ్లండ్ విజయలక్ష్యం మారింది. కార్డిఫ్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. 305 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించేందుకు ఇంగ్లండ్ సిద్ధమవుతుండగా వర్షం కురిసింది. దీంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం రెండో వన్డేను 47 ఓవర్లకు కుదించి 295 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించారు. దీంతో, బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లకు 29 పరుగులు చేసింది. హాల్స్, కుక్ క్రీజులో ఉన్నారు.