: బాబుకు దళిత నేత హెచ్చరిక
రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే ఆంధ్రప్రదేశ్‌కు బౌద్ధప్రదేశ్ అని పేరు పెట్టాలంటూ విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక ఇచ్చిన దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, గుంటూరు- విజయవాడ మధ్య ఏపీ రాజధాని నిర్మించాలని, లేదంటే తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు. మంత్రి నారాయణకు చంద్రబాబు తొత్తుగా మారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు పేరుతో కృష్ణా జిల్లాను రాజధానిగా చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయనే గతంలో గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు.