: పవన్ కల్యాణ్ పై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో 'వింత' ఫిర్యాదు


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో బాలరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రూ.50 నోట్ పై తన బొమ్మను ముద్రించుకుని జాతిపిత మహాత్మగాంధీని కించపరిచే విధంగా పవన్ కల్యాణ్ ఫేస్ బుక్ లో ప్రచారం చేసుకుంటున్నాడని బాలరాజు అభియోగం మోపారు. వందేళ్ల క్రితం పుట్టి ఉంటే మహాత్మునికి బదులు... తన బొమ్మే వేసుకునేవాడినని పవన్ ప్రచారం చేసుకుంటున్నారని బాలరాజు ఫిర్యాదు చేశాడు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని పవన్ ఏ విధంగా మహాత్ముడు అవుతాడని బాలరాజు ఈ ఫిర్యాదులో ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News