: ప్రైవేటు సంస్థల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్ర మంత్రి


యూపీఏ ప్రభుత్వం నిర్ణయించినట్టు రాయితీ ధరకే వినియోగదారులకు ఏడాదికి 12 సిలెండర్లు అందించనున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆయిల్ కంపెనీల్లో ప్రభుత్వ వాటాల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. భవిష్యత్ లో నిర్ణయాలను ఇప్పుడే వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. పెట్రోలియం కంపెనీలకు ధరల నిర్ణయం కట్టబెట్టినప్పటి నుంచి ఆయిల్ కంపెనీల్లో ప్రభుత్వ వాటాలు కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి, మంత్రి తాజా ప్రకటనతో ఆయా కంపెనీల ఆశలపై నీళ్లు నట్టయింది.

  • Loading...

More Telugu News