: ధోనీని కీర్తిస్తున్న రామ్ దిన్
వెస్టిండీస్ వికెట్ కీపర్ దినేశ్ రామ్ దిన్... టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికెత్తేస్తున్నాడు. అతనో గొప్ప నాయకుడు అని కొనియాడాడు. భారత పర్యటన కోసం విండీస్ జట్టు రాంచీ చేరుకుంది. ఈ సందర్భంగా రామ్ దిన్ మీడియాతో మాట్లాడుతూ, కెప్టెన్, బ్యాట్స్ మన్, వికెట్ కీపర్... ఎలా చూసినా ధోనీ గ్రేట్ అని అభివర్ణించాడు. అలా రాణించడం నిజంగా చాలా కష్టమైన విషయం అని పేర్కొన్నాడు. "ధోనీ వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. చాంపియన్స్ లీగ్, ఐపీఎల్ అన్నింటా తాను నాయకత్వం వహించిన జట్లను గెలిపించాడు" అని ఈ భారత సంతతి విండీస్ క్రికెటర్ వివరించాడు.