: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ తో వెబ్ సైట్ క్రాష్


'ఎయిర్ ఇండియా డే' సందర్భంగా ప్రకటించిన రూ.100లకే టికెట్ ప్రకటన ఔత్సాహిక ప్రయాణికులను బాగానే ఆకర్షించింది. దాంతో, ఒక్కసారే అనేకమంది ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటుండడంతో ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నిమిషాల్లోనే క్రాష్ అయింది. నేటి నుంచి ఈ నెల 31 వరకే ఈ పరిమిత బంపర్ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ క్రమంలో మొదటిరోజే వెబ్ సైట్ కు అపూర్వరీతిలో ట్రాఫిక్ పెరిగింది. ఆ కారణంగా వెబ్ సైట్ 'సర్వీస్ అందుబాటులో లేదు', 'సిస్టమ్ బిజీ' అని చూపుతోంది. ఏదేమైనా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్ ఇండియా వేసిన పథకం బాగానే సక్సెస్ అయింది.

  • Loading...

More Telugu News