: ఆ కీచకుడు చిన్నారినీ వదల్లేదు... వారం రోజులుగా అత్యాచారం


అన్నెంపున్నెం తెలియని పసికందులు కూడా అత్యాచారాల బారిన పడుతోంటే సమాజం ఎటు పయనిస్తోందో అర్థం కాని దుస్థితి దేశంలో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ధని గ్రామంలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. శ్రీనివాస్ (20) అనే కామాంధుడు ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఈ దారుణం వారం రోజులుగా జరుగుతోంది. అతని నిర్వాకంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కీచకుడు పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News