: ఇక మిగిలింది పోరాటమే... మెదక్ స్థానానికి నామినేషన్లు దాఖలు


మెదక్ లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ విప్ జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఓ అంకం ముగిసిందని, ఇక మిగిలింది హోరాహోరీ పోరాటమేనని అభ్యర్థులంతా అభిప్రాయపడ్డారు. గెలుపు మాదంటే మాదేనని అభ్యర్థులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాకు పథకాలు తేవడంలో అంతులేని కృషి చేస్తామని ముగ్గురూ తెలిపారు.

  • Loading...

More Telugu News